తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 1:14 PM IST

ETV Bharat / business

హీరో నుంచి ఎలక్ట్రిక్​ వాహనం ఎప్పుడంటే..?

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​​.. ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి అడుగు పెట్టనుంది. వచ్చేఏడాది తన తొలి ఎలక్ట్రిక్​ వాహనాన్ని మార్కెట్​లోకి తీసుకురానుంది.

Hero MotoCorp
హీరో నుంచి ఎలక్ట్రిక్​ వాహనం ఎప్పుడంటే..?

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​​ వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇందుకుగాను తన మొదటి ఎలక్ట్రిక్​ మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. వినియోగదారులు ఎక్కువగా ఈ విభాగంలో వాహనాలు కొనేందుకు మొగ్గు చూపుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాజస్థాన్​లోని జైపుర్​, జర్మనీలోని స్టెఫాన్స్​కిర్​చెన్​ రీసర్చ్ కేంద్రాలను ఉపయోగించి సొంతంగా వాహనాన్ని రూపొందించాలని చూస్తున్నట్లు వివరించారు.

హీరో మోటోకార్ప్ 2022 మొదటి త్రైమాసికంలో సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయనుంది. ఇందుకుగాను ఇటీవలే తైవాన్​కు చెందిన గొగోరో అనే బ్యాటరీల కంపెనీతో చేతులు కలిపింది.

"మా సంస్థ నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రికల్​ ఉత్పత్తులలో ఒకదాన్ని మార్కెట్​లోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. అందుకే గొగోరో అనే తైవాన్ కంపనీతో చేతులు కలిపాము."

-నిరంజన్ గుప్తా, హీరో మోటోకార్ప్ సీఎఫ్ఓ

గొగోరోతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల తమ సంస్థ తన సొంత ఉత్పత్తులను కూడా పెంచుకునే అవకాసం లభించిందని గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి:ఏప్రిల్​లో​ మూడు రెట్లు పెరిగిన ఎగుమతులు

ABOUT THE AUTHOR

...view details