తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్ న్యూస్​: హీరో బైక్​ల ధరలు భారీగా తగ్గింపు

విద్యుత్​ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్​.. ప్రముఖ మోడళ్లపై భారీగా ధరలను తగ్గించింది. అయితే సాధారణ వాహనాలపై మరోసారి ధరలను పెంచింది హీరో మోటోకార్ప్.

motocorp
hero

By

Published : Jun 25, 2021, 5:17 PM IST

ప్రముఖ విద్యుత్ వాహన మోడళ్లపై 33శాతం వరకు ధరలను తగ్గించినట్లు హీరో ఎలక్ట్రిక్ శుక్రవారం వెల్లడించింది. ఫేమ్​ 2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్​ ఎలక్ట్రిక్ వెహికిల్స్) పథకం కింద సబ్సిడీని కేంద్రం పెంచడం మూలంగా.. ఆ లబ్ధిని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సింగిల్ బ్యాటరీ మోడళ్లపై 12శాతం, 3 బ్యాటరీల వేరియంట్లపై 33శాతం ధరలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

ఇవే కొత్త ధరలు..

మోడల్ కొత్త ధర పాత ధర
ఫోటాన్ హెచ్​ ఎక్స్​ రూ.71,449 రూ.79,940
ఎన్​వైఎక్స్​ హెచ్​ఎక్స్​ రూ.85,136 రూ.1,13,115
ఆప్టిమా ఈఆర్​ రూ.58,980 రూ.78,640

అవి మాత్రం భారమే..

అయితే సాధారణ ద్విచక్రవాహనాల ధరలను మరోసారి పెంచింది హీరో మోటోకార్ప్. బైకులు, స్కూటర్లపై రూ.3వేల వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు అన్ని టూవీలర్​లకు వర్తిస్తుందని స్పష్టంచేసింది. పెరిగిన ధరలు 2021 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. మోడల్​, నిర్దిష్ట మార్కెట్​ ఆధారంగా ధరల పెంపులో మార్పులుంటాయి.

ముడి పదార్ధాల ధరలకు రెక్కలు వచ్చినందు వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగినట్లు హీరో తెలిపింది. దీంతో తప్పనిసరిగా ధరలను పెంచుతున్నట్లు వివరించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్​లోనూ ఇదే కారణంతో ధరలను పెంచింది హీరో.

ఇదీ చూడండి:హీరో నుంచి ఎలక్ట్రిక్​ వాహనం ఎప్పుడంటే..?

ABOUT THE AUTHOR

...view details