Pay Home Loan Faster: గృహరుణాన్ని తొందరగా ముగించేయడానికి రెండు మార్గాలున్నాయి. మొత్తం బాకీని ఒకేసారి చెల్లించడం.. లేదా కుదిరినప్పుడల్లా పాక్షికంగా రుణానికి జమ చేయడం. చాలామంది రుణ గ్రహీతలకు ఒకేసారి రుణం చెల్లించడం సాధ్యం కాదు. అందుకే, పాక్షిక చెల్లింపులతోనే ఈ భారాన్ని తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేయాలి.
మిగులు డబ్బుతో..
గృహరుణం తీసుకునే సమయంలో రుణగ్రహీత ఈఎంఐ వారి ప్రస్తుత ఆర్థిక చెల్లింపు సామర్థ్యంకన్నా తక్కువగా ఉంచుతారు. రుణం తీసుకున్న కొన్నేళ్ల తర్వాత ఆదాయం పెరగొచ్చు. ఇలాంటి సందర్భాల్లో రుణగ్రహీత రుణాన్ని ముందస్తుగా చెల్లించేందుకు అదనపు ఆదాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అప్పు ఇచ్చిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి, ఈఎంఐని పెంచాల్సిందిగా కోరవచ్చు. దీనివల్ల వడ్డీలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. గృహరుణాన్ని నిర్ణీత వ్యవధుల్లో చెల్లించేందుకు డబ్బును కూడబెట్టడం మరో విధానం. దీనివల్ల మీరు వీలును బట్టి, మీ దగ్గరున్న సొమ్ముతో గృహరుణం నుంచి తొందరగా బయటపడొచ్చు. మీ దగ్గర ఎంత డబ్బు మిగులుతుంది అనేదాన్ని బట్టి, రెండింటిలో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి.
అనుకోకుండా వచ్చే ఆదాయాలు...
సందర్భానుసారంగా వచ్చిన బోనస్‌లు, వారసత్వ ఆస్తి నుంచి ఆదాయంలాంటివి వచ్చినప్పుడు ఈ మొత్తాలను గృహరుణాన్ని ముందుగా చెల్లించేందుకు వాడుకోవచ్చు. దీనివల్ల మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఈ మొత్తాలను గృహరుణానికి కేటాయించాలా? పెట్టుబడికి మళ్లించాలా అనేదీ విశ్లేషించుకోవాలి. గృహరుణంపై వడ్డీ కన్నా పెట్టుబడిపై రాబడి అధికంగా ఉంటే.. మీరు ఆ నిధులను పెట్టుబడి పెట్టొచ్చు. రెండింటినీ పోల్చి చూసినప్పుడు గృహరుణం వడ్డీ/అసలు తిరిగి చెల్లించినప్పుడు లభించే పన్ను ప్రయోజనం, పెట్టుబడి రాబడిపై వచ్చే పన్ను భారం తదితర అంశాలను తప్పనిసరిగా గమనించాలి. ఉదాహరణకు మీకు రూ.5లక్షలు వచ్చాయనుకుందాం. మీ రుణంపై వార్షిక వడ్డీ 6.5శాతం. అదే సమయంలో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7 శాతం ఉందనుకుందాం. మీరు 20 శాతం పన్ను పరిధిలోకి వస్తారని భావిస్తే.. పెట్టుబడిపై నికర వార్షిక రాబడి 5.6%. ఇలాంటి సందర్భాల్లో గృహరుణాన్ని చెల్లించడమే లాభం అన్నమాట.
పొదుపు పెరిగితే..