కరోనా టీకా కేంద్రాల వద్ద తొక్కిసలాటలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా టీకా కేంద్రాల సమాచారంతో పాటు.. ఇతర సేవలను అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చర్యలు చేపట్టింది.
అరచేతిలో వ్యాక్సిన్ సమాచారం.. జస్ట్ గూగుల్! - కరోనా టీకా బుక్ అపాయింట్‌మెంట్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
కరోనా టీకా లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది. సాంకేతికత సహాయంతో దగ్గర్లోని టీకా కేంద్రం వివరాలను తెలుసుకునేలా వీలు కల్పించింది.
covid vaccine near me'
గూగుల్లో 'కొవిడ్ వ్యాక్సిన్ నియర్ మీ' అని సెర్చ్ చేసి వ్యాక్సిన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. స్లాట్‌ల లభ్యత, పేరు నమోదు కోసం 'బుక్ అపాయింట్‌మెంట్' ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇవీ చదవండి: