రెండో త్రైమాసికంలో దేశీయ ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (Q2 Results Of Hdfc Bank).. అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికరలాభం 18శాతం పెరిగి రూ. 9,096కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ. 7,513 కోట్లుగా ఉంది.
రెండింతల ఆదాయాన్ని ఆర్జించిన డీమార్ట్
డీమార్ట్ పేరిట రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం రెండింతలు పెరిగి.. రూ.417 కోట్లకు చేరుకుందని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 198.53కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇక 2021 జులై-అక్టోబర్ మధ్య.. ఆదాయం 46.79 శాతం పెరిగి రూ.7,788.94 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.5,306.02 కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి:నిమిషానికి ఆ కంపెనీల సంపాదన ఎంత?