హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బుధవారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్‌ను(ఏడబ్ల్యూఎస్ బీయూ) ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు క్లౌడ్‌లోకి మారే ప్రాజెక్టులను వేగవంతం చేసేలా సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. హెచ్‌సీఎల్‌లో ఒక విభాగం వలే ఇది పనిచేస్తుంది. దీనికి ఏడబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్‌లు సహకరిస్తాయి. ఇప్పటికే హెచ్‌సీఎల్ ఏడబ్ల్యూఎస్ సామర్థ్యాలపై పనిచేస్తోంది. ఇందుకోసం దాదాపు 10వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20 వేలకు పెంచాలని భావిస్తోంది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 10 వేల ఉద్యోగాలు - ఐటీ ఉద్యోగాలు
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరుద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త తెలిపింది. హెచ్‌సీఎల్ ఏడబ్ల్యూఎస్ విభాగంలో 10 వేల మందిని నియమించనున్నట్లు తెలిపింది.
వ్యాపారాల్లో భవిష్యత్తు టెక్నాలజీ వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్‌సీఎల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్.. "ఏడబ్ల్యూఎస్ బీయూ అనేది మా కంపెనీ #HCLCloudSmart strategyలో కీలక భాగమని పేర్కొన్నారు. వినియోగదారులను ప్రత్యర్థుల కంటే ముందుండేలా బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, ప్రతి కోణంలో సేవలు అందించడం వంటివి చేయడంలో ఏడబ్ల్యూఎస్ బీయూ సహకరిస్తుంది" అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పెట్రో భారం నుంచి మరింత ఊరట- వ్యాట్ కోతతో రాష్ట్రాల దీపావళి గిఫ్ట్