ఆన్లైన్ రుణ సంస్థలను నియంత్రించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై కేంద్రం, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అభిప్రాయాలను తెలపాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
రుణ యాప్‌లపై కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు - రుణ యాప్‌ల నియంత్రణపై కేంద్రానికి నోటీసులు
ఆన్లైన్ రుణ సంస్థల నియంత్రణ కోసం దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్రానికి, ఆర్బీఐకి తాఖీదులు జారీ చేసింది.
రుణ యాప్‌ల నియంత్రణపై సుప్రీం విచారణ
రుణ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా ఆర్బీఐ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. నియంత్రణ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థలు, క్రమబద్ధీకరించని డిజిటల్ రుణాలపై అధ్యయనం కోసం వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మార్గదర్శకాల రూపకల్పనపై ఈ వర్కింగ్ గ్రూపు సూచనలు చేయనుంది.
ఇదీ చూడండి:దా'రుణ' యాప్‌లపై గూగుల్ వేటు
Last Updated : Jan 15, 2021, 5:18 PM IST