పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం(PNB SCAM) కేసులో డొమినికాలో అరెస్టైన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని(Mehul Choksi) భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి డొమినికాలోని డగ్లస్-చార్లెస్ విమానాశ్రయంలో భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు జెట్ వేచి చూస్తోందని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ వెల్లడించారు. డొమినికాకు ప్రైవేటు జెట్ రాకపై స్థానిక మీడియాలో ఇప్పటికే అనేక కథనాలు వెలుబడ్డాయి.
మెహుల్ చోక్సీని(Mehul Choksi) భారత్‌కు అప్పగించాలని డొమినికా పోలీసులను భారత్ కోరింది. ఇప్పటికే అతనిపై ఇంటర్పోల్ నోటీసులు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పీఎన్బీ కుంభకోణంలో(PNB SCAM) మెహుల్ చోక్సీది ప్రధాన పాత్ర అని పేర్కొంది. ఛోక్సీ భారతదేశ పౌరుడని ముందు నుంచే కేంద్రం వాదిస్తూ వస్తోంది. భారత్లో సుమారు రెండు బిలియన్ డాలర్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది. వీటి నుంచి తప్పించుకోవడానికే అతను ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు పేర్కొంది.
2 రోజుల్లో ఆంటిగ్వాకు..