అమెరికన్ల ఉద్యోగాలకు హెచ్-1బీ వీసాలతో ముప్పు ఏర్పడుతోందని, మరిన్ని ఆంక్షలు విధించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విభాగం యోచిస్తోంది. ఈ వాదనలకు చెక్‌పెడుతూ.. హెచ్-1బీ వీసాదారులతో అమెరికన్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని 'ద నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ' అనే సంస్థ వెల్లడించింది. అలాంటి వీసాలు కలిగిన విదేశీయులు ఉండటం ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడింది.
అగ్రరాజ్యంలోని హెచ్-1బీ వీసాదారుల్లో అత్యధికంగా భారతీయ ఐటీ నిపుణులే ఉన్నారు.
" హెచ్-1బీ వీసాదారులు అమెరికా ఉద్యోగార్థులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపరని కొత్త పరిశోధన చెబుతోంది. తక్కువ నిరుద్యోగ రేటు సహా ఇటీవల కళాశాల నుంచి బయటకు వచ్చిన ఆదాయం వేగంగా పెరగడంలో హెచ్-1బీ వీసాదారుల పాత్ర ఉన్నట్లు తేలింది."