ప్రముఖ ఇంటర్నేషల్ బ్రాండ్ గూచీ.. ఓ ఎంబ్రాయిడరీ కుర్తాను రూ.2.5లక్షలకు విక్రయిస్తోందని మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఈ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఓ నెటిజన్.. ట్విట్టర్లో కుర్తా వివరాలను షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు ఫన్నీ, సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ అయి సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.
"ఓ భారతీయ కుర్తాను గూచీ రూ.2.5లక్షలకు విక్రయిస్తోంది. ఇలాంటి కుర్తాను నేను బయట మార్కెట్లో రూ.500కే కొనగలను," అని మొదట ఓ ట్విట్టర్ యూజర్ గూచీ వెబ్సైట్లో కుర్తా ధరను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశాడు. ఈ కుర్తా డిస్క్రిప్షన్ 'యాన్ ఎంబ్రాయిడర్ ఆర్గానిక్ లినెన్ కాఫ్టాన్ అని' వెబ్సైట్లో ఉంది.
ఈ పోస్టుకు నెటిజన్లు చేసిన ఫన్నీ కామెంట్లు...
ఈ కుర్తా మార్కెట్లో రూ. 1000కే దొరుకుతుంది. -ట్విట్టర్ యూజర్
ఈ కుర్తారు నేనైతే రూ.150కి మించి ఒక్క పైసా ఎక్కువ ఇవ్వను. -ట్విట్టర్ యూజర్
దీనిపై అభ్యంతరం లేదు. కానీ ఈ కుర్తాను రూ.500కి ఇచ్చినా నేను కొనను. -ట్విట్టర్ యూజర్
సరోజినీ నగర్లో ఈ కుర్తా రూ.250కే దొరుకుతుంది- ట్విట్టర్ యూజర్