జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు చెల్లించేందుకు....కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 35వేల కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని భరిస్తూ కేంద్రం అయిదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తుంది. ఈ పరిహారం మొత్తం తగినంతగా ఉండడం లేదని రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి.
ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో సుమారు 35వేల 3వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది. మరో 35వేల కోట్ల రూపాయలను సంచిత నిధి నుంచి రెండు విడతల్లో కేంద్రం విడుదల చేయనుంది. మొదటి విడత అక్టోబర్, నవంబర్ మాసాలకు సంబంధించి ఉండనుంది.