తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిబ్రవరిలో రూ.5వేల కోట్లు తగ్గిన జీఎస్టీ వసూళ్లు

జనవరితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు రూ.5వేల కోట్లు తగ్గాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.05 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది. అయితే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ రాబడి 8 శాతం పెరిగినట్లు పేర్కొంది.

GST revenue collection stood at Rs 1,05,366 crore in February
ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లు

By

Published : Mar 1, 2020, 8:48 PM IST

Updated : Mar 3, 2020, 2:20 AM IST

ఫిబ్రవరి నెలలో రూ.1.05 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ రాబడి 8 శాతం పెరిగినట్లు పేర్కొంది. అయితే ఈ ఏడాది జనవరి రాబడి (1.10 లక్షల కోట్లు) కంటే ఐదువేల కోట్లు తగ్గినట్లు వెల్లడించింది.

ఫిబ్రవరి నెలలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,366 కోట్లు ఉంటే... ఇందులో సీజీఎస్టీ రూ.20,569 కోట్లు, ఎస్​జీఎస్టీ రూ.27,348 కోట్లు, ఐజీఎస్టీ రూ.48,503 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రజల కొనుగోలు లావాదేవీలు 12 శాతం పెరిగినట్లు వివరించింది.

ఇదీ చూడండి:ఎస్​బీఐ కార్డు ఐపీఓ రేపే ప్రారంభం.. విశేషాలివే

Last Updated : Mar 3, 2020, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details