తెలంగాణ

telangana

ETV Bharat / business

దివ్యాంగులకు జీఎస్‌టీ తగ్గింపు: రెనో - రెనో

ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ ఆదేశాల మేరకు దివ్యాంగుల కోసం జీఎస్‌టీ తగ్గింపుతో పాటు ప్రత్యేక కార్పొరేట్‌ రాయితీ అందిస్తున్నట్లు రెనో ఇండియా తెలిపింది. తమ డీలర్‌ నెట్‌వర్క్‌ల ద్వారా విభాగాలవారీగా అదనపు ప్రత్యేక రాయితీలు ఇస్తామని వెల్లడించింది.

GST reduction for paraplegics: Reno
దివ్యాంగులకు జీఎస్‌టీ తగ్గింపు: రెనో

By

Published : Dec 4, 2020, 5:39 AM IST

దివ్యాంగుల కోసం జీఎస్‌టీ తగ్గింపుతో పాటు ప్రత్యేక కార్పొరేట్‌ రాయితీ అందిస్తున్నట్లు రెనో ఇండియా తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ ఆదేశాల మేరకు వారికి 18 శాతం జీఎస్‌టీ రేటు వర్తింపజేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌ నెట్‌వర్క్‌ల ద్వారా విభాగాలవారీగా అదనపు ప్రత్యేక రాయితీలు ఇస్తామని తెలిపింది.

అన్ని మోడళ్లకు కార్పొరేట్‌ రాయితీలు వర్తిస్తాయని, జీఎస్‌టీ తగ్గింపు మాత్రం 1200 సీసీ కంటే తక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న నాలుగు మీటర్ల పొడవులోపు పెట్రోలు కార్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. దస్త్రాల సమర్పణ (డాక్యుమెంటేషన్‌) సరిగ్గా ఉంటేనే ఈ జీఎస్‌టీ తగ్గింపు, అదనపు ప్రయోజనాలను వినియోగదార్లు పొందే వీలుంటుందని తెలిపింది. ఈ ఆఫర్ల ప్రకారం డస్టర్‌పై గరిష్ఠంగా రూ.30,000 వరకు.. క్విడ్‌, ట్రైబర్‌పై రూ.9,000 వరకు తగ్గింపును పొందొచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి:పోంజి కుంభకోణంపై రంగంలోకి ఆర్​బీఐ

ABOUT THE AUTHOR

...view details