వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఈనెల 28న భేటీ కానుంది. వర్చువల్గా జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహించనున్నారు.
మే 28న ఉదయం 11 గంటలకు 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
" దిల్లీలో మే 28న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ నేతృత్వం వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరవుతారు. "