కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman news) అధ్యక్షతన జీఎస్‌టీ మండలి (GST council meeting) సమావేశమైంది. ఇది 45వ సమీక్షా సమావేశం. దాదాపు 20 నెలల తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా ఈ భేటీ జరుగుతుండటం విశేషం. కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా మండలి సమావేశాలన్నీ(GST council meeting) వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరిగాయి. లఖ్‌నవూ వేదికగా జరుగుతున్న ఈ భేటీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్‌టీ మండలి భేటీ భేటీలో చర్చాంశాలు..
ప్రస్తుత భేటీలో జీఎస్‌టీ మండలి (GST council meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి (petrol GST) తీసుకురావాలన్న డిమాండ్‌ను.. మండలి ఈ సమావేశంలో పరిశీలించే అవకాశాలున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశం చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
జీఎస్‌టీ మండలి భేటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వీటితో పాటు 48 రకాల వస్తువులపై పన్ను రేట్లను సమీక్షించడం.. 11 రకాల కొవిడ్ అత్యవసరాలపై జీఎస్‌టీ మినహాయింపు గడువు పెంపుపై నిర్ణయం తీసుకోనుంది మండలి. ఈ గడువు 2021 వరకు పెంచే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి:ఆరేళ్లలో రూ.5 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు!