కొవిడ్ అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ మందులపై పన్నురేట్ల తగ్గింపుపై చర్చించేందుకు నేడు జీఎస్టీ మండలి సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరిగే భేటీలో రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొననున్నారు. మెడికల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్లు వంటి వస్తువులపై జీఎస్టీ రాయితీల అంశంపైనా చర్చ జరగనుంది.
గత నెల 28న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను మినహాయింపులు సామాన్యులకు చేరాలనే విషయమై భాజపా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంల మధ్య వాగ్వాదం జరగటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, టీకాలకు పన్ను మినహాయింపు విషయమై మంత్రుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది.