కొవిడ్ విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జులైలో సుమారు రూ. 3 వేల కోట్లకుపైగా తగ్గాయి. గతనెలలో రూ.90,917 కోట్లుగా ఉన్న వసూళ్లు.. ప్రస్తుతం రూ.87,422కు చేరాయి. లాక్డౌన్ కారణంగా మేలో రూ.62,009 కోట్లు, ఏప్రిల్లో అత్యల్పంగా రూ.32,294 కోట్ల పన్నులు మాత్రమే వసూలయ్యాయి.
కరోనా ఎఫెక్ట్: భారీగా పడిపోయిన జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ వసూళ్లు జులై నెలలో భారీ తగ్గుదలను నమోదుచేశాయి. కరోనా సంక్షోభం కారణంగా రూ. 87,422 కోట్లకు పడిపోయాయి. గత నెల పన్నుల వసూళ్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇలా ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్: భారీగా పడిపోయిన జీఎస్టీ వసూళ్లు
జులై జీఎస్టీ లెక్కలివే..
- కేంద్ర జీఎస్టీ - రూ.16,147 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ -రూ.21,418 కోట్లు
- సమీకృత జీఎస్టీ -రూ.42,592 కోట్లు
- సెస్- రూ.7,265 కోట్లు
ఇదీ చదవండి:ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్'