కరోనా లాక్‌డౌన్ సమయంలో క్షీణించిన జీఎస్టీ వసూళ్లు భారీగా పుంజుకున్నాయి. జనవరి నెలకు గానూ అత్యధికంగా దాదాపు రూ.1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో వసూలు అవ్వడం ఇదే తొలిసారి. గతేడాది జనవరితో పోలిస్తే 8 శాతం అధికంగా వసూలయ్యాయి. గతేడాది ఇదే నెలకు జీఎస్టీ రాబడి రూ.1.11 లక్షల కోట్లుగా ఉంది.
జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డ్ - వసూళ్లు
జనవరిలో జీఎస్టీ రాబడి గణనీయంగా పెరిగింది. ఏకంగా రూ. 1.20 లక్షల కోట్లు వసూలైంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో వసూలు కావడం ఇదే తొలిసారి.
జనవరి 31 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) మొత్తం రూ.1,19,847 కోట్లు కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ కింద రూ.21,923 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.29,014 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.60,288 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. సెస్సుల రూపంలో రూ.8,622 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. డిసెంబర్ నెలకు సంబంధించి జనవరి 31 వరకు 90 లక్షల జీఎస్టీఆర్-2బీ రిటర్నులు దాఖలైనట్లు పేర్కొంది. ఇప్పటి వరకు గత నెల వసూలైన రూ.1.15 లక్షల కోట్లే రికార్డు కాగా.. ఆ రికార్డును తాజా వసూళ్లు చెరిపేశాయి.
ఇదీ చూడండి:రక్షణ బడ్జెట్‌పైనా కొవిడ్ ప్రభావం