తెలంగాణ

telangana

ETV Bharat / business

GST Collection: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు - gst collections updates

GST Collection in December 2021: జీఎస్​టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లకుపైనే నమోదయ్యాయి.

GST Collection in December 2021
డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు

By

Published : Jan 1, 2022, 3:23 PM IST

Updated : Jan 1, 2022, 3:48 PM IST

GST Collection in December 2021: వస్తు, సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు 2021 డిసెంబరు​​లోనూ రూ.లక్ష కోట్ల మార్క్​ దాటాయి. జీఎస్​టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,29,780 కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ప్రకటించింది. 2020 డిసెంబరు​తో పోల్చితే ఈ మొత్తం 13 శాతం ఎక్కువని పేర్కొంది. జీఎస్​టీ వసూళ్లు వరుసగా ఆరు సార్లు రూ.లక్ష కోట్లు దాటాయి అని చెప్పింది.

అయితే.. గతేడాది నవంబరుతో పోలిస్తే డిసెంబరులో జీఎస్​టీ వసూళ్లు రూ.1,746 కోట్ల మేర తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. నవంబరులో జీఎస్​టీ వసూళ్లు రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయని చెప్పింది.

వసూళ్లు ఇలా..

  • కేంద్ర జీఎస్​టీ: రూ.22,578 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ: రూ.28,658 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ: రూ.69,155 కోట్లు
  • సెస్​: రూ.9,389 కోట్లు

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో(అక్టోబరు-డిసెంబరు) జీఎస్​టీ నెలవారీ వసూళ్లు సగటున రూ.1.30 లక్షల కోట్లు నమోదయ్యాయిని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకోవడం, జీఎస్​టీ ఎగవేత వ్యతిరేక చర్యలు తీసుకోవడం కారణంగా జీఎస్​టీ వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:LPG Cylinder Price: గుడ్​ న్యూస్​.. తగ్గిన గ్యాస్ ధర

ఇదీ చూడండి:కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు

Last Updated : Jan 1, 2022, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details