2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కానీ 2020-21 నాటికి ఈ వృద్ధి రేటు కొంత అభివృద్ధి చెంది.. 5.8 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
"భారత్లో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రుణ బలహీనత కొనసాగుతుంది. మార్చి 31తో ముగిసే 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5 శాతానికి తగ్గుతుంది. అయితే తరువాతి ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధిరేటు 5.8 శాతానికి చేరుకునే అవకాశం ఉంది."-ప్రపంచ బ్యాంకు
బ్యాంకింగేతర సంస్థలలో రుణాల మంజూరు కోసం ఉన్న కఠినతర నిబంధనలు, వినియోగంలో తగ్గుదలకు తోడు ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు కూడా దేశ వృద్ధిరేటుపై ప్రభావం చూపుతున్నాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.