తెలంగాణ

telangana

ETV Bharat / business

రిజిస్ట్రేషన్​ కాలం పూర్తయ్యే వరకు బీఎస్​-4కు ఢోకా లేదు

బీఎస్-4 వాహనాలపై ఉన్న అనుమానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టతనిచ్చారు. వాటి రిజిస్ట్రేషన్​ సమయం ముగిసేంత వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్​ కాలం పూర్తయ్యే వరకు బీఎస్​-4కు ఢోకా లేదు

By

Published : Aug 23, 2019, 10:24 PM IST

Updated : Sep 28, 2019, 1:06 AM IST

వాహన​ రంగంలో వృద్ధి రేటు పడిపోవటాన్ని సవాలుగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొనుగోలు, రిజిస్ట్రేషన్​ ప్రక్రియలపై స్పష్టతనిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

విద్యుత్​ వాహనాలు, బ్యాటరీలను ప్రోత్సహిస్తూ ఇస్తున్న ప్రభుత్వ ప్రకటనలతో సందేహాలు నెలకొన్నాయి. ఆటోమొబైల్​ సంస్థలు కూడా అందుకు తగ్గట్టు వాహనాలను తయారు చేస్తున్నాయి. వీటిని తొలగిస్తున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్​ సమయం పూర్తయ్యే వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వాహనాలకు ఇది వర్తిస్తుందన్నారు.

రిజిస్ట్రేషన్​ కాలం పూర్తయ్యే వరకు బీఎస్​-4కు ఢోకా లేదు

"2020 మార్చి వరకు కొనుగోలు చేసే బీఎస్-4 వాహనాలు.. వాటి రిజిస్ట్రేషన్ సమయం పూర్తయ్యే వరకు రోడ్లపై తిరగవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏకకాల రిజిస్ట్రేషన్‌ రుసుం సవరణను 2020 జూన్​ వరకు నిలిపివేస్తున్నాం. ఎలక్ట్రానిక్ (ఈవీ), ఇంధన ఆధారిత వాహనాలు(ఐసీవీ) రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. "

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

వాహన రంగం మెరుగైన వృద్ధి సాధించేందుకు ప్రభుత్వ విభాగాల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని తెలిపారు నిర్మల. పాత వాహనాల రిప్లేస్​మెంట్​ ద్వారా కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామన్నారు. ఫలితంగా వాహన రంగ సంస్థలకు డిమాండ్​ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:లైవ్​: మాంద్యంపై యుద్ధానికి కేంద్రం బహుముఖ వ్యూహం

Last Updated : Sep 28, 2019, 1:06 AM IST

ABOUT THE AUTHOR

...view details