బంగారు ఆభరణాలపై జూన్ 1 నుంచి హాల్మార్క్ తప్పనిసరి కానుంది. దీన్ని అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
పసిడి స్వచ్ఛతను నిర్ధరించే ఈ హాల్మార్క్ పద్ధతిని అమలు చేయాలని 2019 నవంబర్లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం వ్యాపారులకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో వ్యాపారుల అభ్యర్థన మేరకు దీన్ని జూన్ 1 వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది.