భారత్ ఎగుమతులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు నూతన పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్రం. ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్యాక్స్ రీఫండ్ ఫథకాన్ని మంత్రివర్గం ముందుకు తీసుకురానున్నట్లు రాజ్యసభలో వెల్లడించారు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.
వివిధ కార్మిక చట్టాలను క్రోడీకరించి మరింత సులభంగా అందరికీ అర్థమవయ్యేలా చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు గోయల్. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్ల పేర్కొన్నారు.
భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై పన్ను రాయితీ తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విధానం ద్వారానే ట్యాక్స్ రీఫండ్‌ను అమలు చేయనున్నట్లు గోయల్ తెలిపారు.