తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్ అడిగినా ఆ ఔషధం ఎగుమతులకు నో! - anti-malarial drug

హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ఎగుమతులపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది కేంద్రం. వైరస్​ వ్యాప్తి దేశంలో అంతకంతకూ పెరుగుతున్నందున ముందు జాగ్రత్తగా ఈ ఔషధం కొరత లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ మందుల్ని అందించాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు భారత్​ను కోరినట్లు చెప్పిన కాసేపటికే  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

hydroxycloroquine
ట్రంప్ అడిగినా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులకు నో

By

Published : Apr 5, 2020, 8:17 PM IST

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది కేంద్రం. ఎక్స్​పోర్ట్​ ఓరియంటెడ్​ యూనిట్స్​(ఈఓయూ), ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ స్కీమ్​ కింద కూడా వీటిని ఎగుమతి చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై సెజ్​లు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయడానికి వీల్లేదని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ప్రకటనలో తెలిపింది.

మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కరోనాపైనా ప్రభావం చూపుతుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​​) తెలిపిన నేపథ్యంలో మార్చి 25నే వీటి ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్రం. అయితే సెజ్​లు, ఈఓయూలకు మినహాయింపునిచ్చింది. ఇప్పడు వాటిపైనా ఆంక్షలు విధించింది.

ట్రంప్ అడిగినా నో..

అమెరికాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకు 7వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3లక్షల మందికిపైగా వ్యాధి బారినపడ్డారు. దీంతో కరోనాపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్​ను తమకు ఎగుమతి చేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. భారత్​ భారీ స్థాయిలో వీటిని తయారు చేస్తోందన్నారు. తన అభ్యర్థనను సీరియస్ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ తర్వాత రైలు ఎక్కాలంటే ఇవి తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details