తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ ఇండియా విక్రయ ఒప్పందంపై కేంద్రం సంతకం - ఎయిర్ ఇండియా టాటా గ్రూపు

ఎయిర్ ఇండియాలో(Air India news) వాటా అమ్మకంపై టాటా సన్స్​ గ్రూపుతో రూ.18 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం తెలిపింది.

air india share purchase agreement
ఎయిర్ ​ఇండియాలో వాటాల కొనుగోలు

By

Published : Oct 25, 2021, 5:26 PM IST

Updated : Oct 25, 2021, 6:46 PM IST

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా(Air India news) ప్రైవేటీకరణలో కీలక ప్రక్రియ ముగిసింది. ఎయిర్ ఇండియాలో వాటాను రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు టాటా సన్స్​ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

"ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల కోసం టాటా సన్స్‌తో ప్రభుత్వం ఈరోజు వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది."

-తుహిన్ కాంత పాండే, డీఐపీఎం కార్యదర్శి

భారీ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను టాటా గ్రూప్​ సొంతం చేసుకుంది. ఇటీవల ముగిసిన బిడ్ల ప్రక్రియలో వివిధ సంస్థలు తమ బిడ్లను సమర్పించగా.. అందులో నుంచి టాటా గ్రూప్​ను ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

టాటా- ఎయిర్​ఇండియా బంధం పాతదే..

భారత్​కు స్వాతంత్ర్యం రాకముందే.. అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్​డీ టాటా.. 1932 'టాటా ఎయిర్​లైన్స్' పేరుతో విమానయాన సంస్థను నెలకొల్పారు.1953లో జాతీయీకరణతో ఈ సంస్థ ప్రభుత్వ పరమైంది. అయితే, 1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. తిరిగి 68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ వారి చేతుల్లోకే వెళ్లింది.

Last Updated : Oct 25, 2021, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details