తెలంగాణ

telangana

ETV Bharat / business

'సామాజిక మాధ్యమాల'పై ఐటీ నిబంధనల వివరాలు వెల్లడి - social media restrictions

సామాజిక మాధ్యమాలపై.. ఐటీ నిబంధనల వివరాలను కేంద్రం వెల్లడించింది. 50 లక్షలకుపైగా వినియోగదారులు ఉన్న మాధ్యమాలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది.

it
ఐటీ నిబంధనల వివరాలను వెల్లడించిన కేంద్రం

By

Published : Feb 27, 2021, 2:52 PM IST

సామాజిక మాధ్యమాలపై ఇటీవల ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది. 50లక్షల లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులు ఉన్న సామాజిక మాధ్యమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. దీని ప్రకారం సంబంధిత సంస్థలు చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్​, నోడల్​, రెసిడెంట్​ గ్రీవెన్స్ అధికారులను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారత్​ నుంచే కార్యకలాపాలు జరపాలి. అభ్యంతకర పోస్టులపైన వారు తీసుకున్న చర్యల గురించి ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందించాలి.

36 గంటల్లో..

పోస్టులపై ప్రభుత్వం లేదా కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత పోస్టులను 36 గంటల్లోగా తొలగించాలి. పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదు అందితే సంస్థలు వాటిని 24 గంటల్లోగా తొలగించాలి. తప్పుడు సమాచారాన్ని మొదట ప్రారంభించిన వారి వివరాలను కోర్టు లేదా ప్రభుత్వాలు కోరితే.. వాటిని అందించాలి.

ఇదీ చదవండి :సోషల్​ మీడియాపై నియంత్రణ.. ఏ దేశంలో ఎలా?

ABOUT THE AUTHOR

...view details