తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా కమ్యూనికేషన్స్ నుంచి పూర్తిగా వైదొలగిన కేంద్రం

టాటా కమ్యూనికేషన్స్ నుంచి వైదొలిగినట్లు కేంద్రం వెల్లడించింది. తనకున్న 10 శాతం వాటాను పనాటోన్ ఫిన్‌వెస్ట్‌కి విక్రయించినట్లు టెలికం విభాగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Govt sells 10 pc stake to exit Tata Communications
టాటా కమ్యూనికేషన్స్ నుంచి పూర్తిగా వైదొలగిన కేంద్రం

By

Published : Mar 19, 2021, 9:28 PM IST

టాటా కమ్యూనికేషన్స్‌లో కేంద్ర ప్రభుత్వం తన 10 శాతం వాటాను విక్రయించింది. 10 శాతం వాటాను టాటా సన్స్‌ అనుబంధ సంస్థ పానటోన్‌ ఫిన్‌వెస్ట్‌కు విక్రయించడం ద్వారా టాటా కమ్యూనికేషన్‌ నుంచి వైదొలిగింది. ఈ మేరకు తన వాటాలో ఉన్న 10 శాతం విలువ చేసే 2 కోట్ల 85 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫ్‌ మార్కెట్‌ ట్రేడ్‌ ద్వారా విక్రయించినట్లు టెలికం విభాగం ప్రకటన జారీ చేసింది.

టాటా కమ్యూనికేషన్‌లో కేంద్ర ప్రభుత్వానికి మొత్తంగా 26.12 శాతం వాటా ఉండేది. ఇందులో ఇప్పటికే 16.12 శాతం వాటాను 'ఆఫర్‌ ఫర్‌ సేల్'‌ ద్వారా అమ్మగా.. తాజాగా 10 శాతం వాటాను కూడా విక్రయించింది. దీంతో పూర్తిగా టాటా కమ్యూనికేషన్‌ నుంచి కేంద్రం వైదొలిగింది.

ఇదీ చదవండి:డీఎఫ్​ఐ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఓకే

ABOUT THE AUTHOR

...view details