దేశంలో వంటనూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. దిగుమతులను గణనీయంగా పెంచినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. ఈ అంశంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
క్రమంగా తగ్గుదల..
మే 7న పామాయిల్ ధర కిలోకు రూ.142 ఉండగా ప్రస్తుతం రూ.115కి పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ముంబయిలో మే 20న సోయా నూనె ధర కిలోకు రూ.162 ఉండగా.. ఇప్పుడు రూ.138కి లభిస్తున్నట్లు వివరించింది.
హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వంట నూనెలకు డిమాండ్ తగ్గినందున.. 2019-20లో దిగుమతులు 13 శాతం తగ్గి 135.25 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి.