తెలంగాణ

telangana

ETV Bharat / business

అవినీతి అధికారులపై కేంద్ర ఆర్థిక శాఖ కొరడా - ఆదాయపు పన్ను అధికారుల బలవంతపు రాజీనామా

ఆదాయ పన్ను శాఖలోని అవినీతి అధికారులపై మరోసారి వేటు వేసింది ప్రభుత్వం. 21 మంది గ్రూప్​-బీ స్థాయి అధికారులతో బలవంతంగా రాజీనామా చేయించింది ఆర్థిక శాఖ. ఇలా ఇప్పటివరకు 5 దఫాల్లో 85 మందికి ఉద్వాసన పలికింది కేంద్రం.

BIZ-TAX-OFFICER-SACK
ఆదాయపు పన్ను శాఖ

By

Published : Nov 26, 2019, 5:28 PM IST

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులతో బలవంతంగా రాజీనామా చేయించింది ప్రభుత్వం. ప్రజాప్రయోజన ప్రాథమిక నిబంధన 56(జే) ప్రకారం వీరితో రాజీనామా చేయించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం వేటు పడిన ఉద్యోగులందరూ గ్రూప్​-బీ స్థాయి అధికారులు. వీరిపై అవినీతి, సీబీఐతోపాటు ఇతర కేసులున్నట్లు తెలుస్తోంది. వీరిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) చర్యలు తీసుకుంది.

ఈ ఏడాది జూన్​ నుంచి ఇలా బలవంతపు రాజీనామాలు చేయించటం ఇది ఐదోసారి. ఈ 5 దఫాల్లో 85 మంది అధికారులతో రాజీనామా చేయించారు. ఇందులో 64 మంది ఉన్నతస్థాయి అధికారులతో పాటు 12 మంది సీబీడీటీ ఉద్యోగులూ ఉన్నారు.

సెప్టెంబర్​ నుంచి రెండోసారి..

చివరి సారిగా సెప్టెంబర్​లో 15 మంది కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్​ మండలి (సీబీఐసీ) అధికారులు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో ముంబయి నుంచి ముగ్గురు సీబీడీటీ అధికారులు, ఠాణే నుంచి ఇద్దరు ఉన్నారు.

మిగతా అధికారులు హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, హజారిబాగ్​, నాగ్​పుర్​, రాజ్​కోట్​, జోధ్​పుర్​, మాదోపుర్​, బికనేర్​, భోపాల్​, ఇండోర్​కు చెందినవారని తెలుస్తోంది.

మోదీ హెచ్చరికతో..

ఈ ఉద్వాసనలు ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగానికి ఆచరణాత్మక చర్యలని సమాచారం. ఆదాయ పన్ను శాఖలో ఇంటి దొంగలు ఉన్నారనీ.. అధికార దుర్వినియోగానికి పాల్పడి పన్ను చెల్లింపుదారుల్ని వేధిస్తున్నారని మోదీ ఆరోపించారు. వారిపై సరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు

ABOUT THE AUTHOR

...view details