తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్రం కీలక నిర్ణయం- తగ్గనున్న వంట నూనెల ధరలు!

శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై ఉన్న ఆంక్షలను కేంద్రం సడలించింది. డిసెంబర్ వరకు దిగుమతులపై ఆంక్షలు ఉండవని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం నిర్ణయంతో.. వంట నూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.

Govt removes import restrictions on refined palm oil till December
వంటనూనె ధరలు

By

Published : Jul 1, 2021, 8:52 PM IST

దేశంలో వంట నూనెల ధరలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై ఉన్న ఆంక్షలను డిసెంబర్ 31 వరకు సడలించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్​టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చర్య ద్వారా దేశీయ మార్కెట్​లో నిల్వలు పెరిగి.. ధరలు దిగి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

అంతర్జాతీయంగా వంట నూనెలు, శుద్ధి చేసిన పామాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ముడి పామాయిల్​పై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. సెప్టెంబర్ వరకు ఇది అమలులో ఉంటుందని మంగళవారం తెలిపింది.

వంటనూనె ధరలు తగ్గించేలా కేంద్రం కీలక నిర్ణయం

దిగుమతుల వల్లే..

దేశంలో వినియోగించే వంటనూనెలో దిగుమతుల నుంచి వచ్చేదే ఎక్కువ. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ధరలు దేశంలో ఆయిల్ రేట్లపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ప్రపంచంలో వెజిటెబుల్ ఆయిల్​ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారతే. ఏటా 15 మిలియన్ టన్నుల వెజిటెబుల్ ఆయిల్​ను విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుండగా.. 9 మిలియన్ టన్నుల పామాయిల్, 6 మిలియన్ టన్నుల సోయాబీన్, సన్​ఫ్లవర్ ఆయిల్​ను కొనుగోలు చేస్తోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details