ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమచేసే డిపాజిట్ పరిమితిని కేంద్రం ఏడాదికి ఐదు లక్షలకు పెంచింది. ఆ మొత్తంపై వచ్చే వడ్డీపై పన్నుమినహాయింపునిచ్చింది. అయితే రిటైర్మెంట్ ఫండ్‌కు యాజమాన్యం చందా లేని కేసుల్లోనే వర్తిస్తుందని తెలిపింది.
ఏడాదిలో ఉద్యోగుల పీఎఫ్ చందా రెండున్నర లక్షలు దాటితే పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ మేరకు ఆర్థిక బిల్లు 2021కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి. మూజువాణి ఓటుతో ఆమోదం బిల్లుకు 127 సవరణలు చేశారు. పీఎఫ్ ఖాతాలకు సంబంధించి వడ్డీలపై పన్ను కేవలం ఒకశాతం చందాదారులకు మాత్రమే వస్తారని వెల్లడించారు.