అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.3 పెంచింది.
ఫలితంగా లీటర్ పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రూ.2 నుంచి రూ.8కి పెంచింది. డీజిల్‌పై రూ.4 వడ్డించింది. అంతేకాకుండా రోడ్డు సెస్‌ను లీటర్‌పై రూ.1 అదనంగా పెంచి రూ.10కి తీసుకొచ్చింది. ఈ నిర్ణయాలతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ.22.98, డీజిల్‌పై రూ.18.83కు చేరింది. 2014లో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పెట్రోల్‌పై పన్ను లీటర్‌కు రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉండేది. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య 9 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది మోదీ సర్కారు.
రూ.39 వేల కోట్ల ఆదాయం