వినియోగదారులు కొనుగోళ్లు చేసేటప్పుడు బిల్లులను తీసుకునేలా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేస్తోంది. జీఎస్టీ చెల్లింపుదారులకు లాటరీ పద్ధతిలో రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందించాలని యోచిస్తోంది.
ప్రతి బిల్లూ పరిగణనలోకి
ప్రతి జీఎస్టీ చెల్లింపుదారుని బిల్లును లాటరీ పద్ధతి కోసం పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) వర్గాలు తెలిపాయి. లాటరీ డబ్బును అక్రమాదాయ వ్యతిరేక కార్యకలాపాల ద్వారా నిర్వహిస్తున్న వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి చెల్లిస్తామని వెల్లడించాయి.
"మేము సరికొత్త లాటరీ పద్ధతిని తీసుకొస్తున్నాము. దీనిలో ప్రతి జీఎస్టీ చెల్లింపుదారుని బిల్లును పరిగణనలోకి తీసుకుంటాం. కొనుగోలు బిల్లులు పోర్టల్లో అప్లోడ్ అవుతాయి. అక్కడ డ్రా స్వయంచాలకంగా జరుగుతుంది. దీని బహుమతి విలువ చాలా ఎక్కువ. సుమారు రూ.10 లక్షల నుంచి కోటి వరకు గెలుచుకోవచ్చు. ఇది వినియోగదారుడు తప్పకుండా జీఎస్టీ బిల్లు తీసుకునేలా చేస్తుంది."
- జోసెఫ్, అసోచామ్ సమావేశంలో