కొవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్ టూల్‌కిట్' వ్యవహారంలో ప్రముఖ సోషల్‌మీడియా ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ టూల్‌కిట్‌గా చెబుతూ చేసిన ట్వీట్లను 'మ్యానిపులేటెడ్ మీడియా'గా పేర్కొనడంపై మండిపడ్డ కేంద్రం.. ఆ పదాన్ని వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దేశంలో కొవిడ్ పరిస్థితులపై కాంగ్రెస్ ప్రత్యేక టూల్‌కిట్ రూపొందించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని భాజపా ఆరోపణలు చేస్తోంది. ఇటీవల ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా కాంగ్రెస్ టూల్‌కిట్‌గా పేర్కొంటూ ట్వీట్ చేశారు. భాజపాకు చెందిన నేతలు కూడా దీన్ని రీట్వీట్ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ట్వీట్లను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టూల్‌కిట్ అని ఉన్న ట్వీట్ల కింద 'మ్యానిపులేటెడ్ మీడియా' అని ట్విట్టర్ నిన్న సాయంత్రం మార్క్ చేసింది.
ఈ విషయంపై స్పందించిన కేంద్రం.. ఆ పదాన్ని వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
'ఈ వ్యవహారంపై విచారణ పెండింగ్‌లో ఉంది. సదరు సమాచారం నిజమా? కాదా? అన్నది చెప్పాల్సింది దర్యాప్తు సంస్థ. ట్విట్టర్ కాదు. దర్యాప్తు ప్రక్రియలో ట్విట్ఠర్ జోక్యం చేసుకోకూడదు. ఈ అంశంపై విచారణ జరుగుతుండగానే ట్విట్టర్ తీర్పు చెప్పకూడదు'అని కేంద్రం హెచ్చరించినట్లు సదరు వర్గాల సమాచారం. ఆ పదాన్ని తొలగించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.