వాహన తయారీ, అనుబంధ కంపెనీలకు(Auto Industry) దాదాపు రూ.25,000 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. తొలుత పెట్రోల్, డీజిల్ వాహన తయారీ సంస్థలకు మాత్రమే రాయితీలు(Government Incentives) అందించాలనుకున్న సర్కార్ ఇటీవల మనసు మార్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విద్యుత్తు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు గిరాకీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకాలు కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహనాల తయారీ కంపెనీలకే దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చేవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తొలుత ఆటో రంగానికి..
అంతర్జాతీయ స్థాయి తయారీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం 27 బిలియన్ డాలర్లతో భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తొలుత ఆటో రంగానికి(Auto Industry) ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు వాహనాలు, హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ ఆధారిత కార్లు తయారు చేసే కంపెనీలకు వార్షిక టర్నోవర్‌లో 10%-20% నిధులను నగదు రూపంలో ఆయా సంస్థలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐదేళ్లలో కనీసం 272 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం షరతు విధించే అవకాశం ఉంది. ఇదే తరహాలో విడిభాగాలు ఉత్పత్తి చేసే కంపెనీలకు సైతం షరతులతో కూడిన ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
ప్రత్యమ్నాయ వనరులపై...