దేశవ్యాప్తంగా ఇకపై అన్ని వాహనాలకు ఒకే రకమైన కాలుష్య నియంత్రణ(పీయూసీ) ధ్రువీకరణ(PUC certificate) పత్రాన్ని జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సర్టిఫికేట్‌పై క్యూఆర్ కోడ్(QR code)ను ప్రింట్ చేయనున్నట్లు తెలిపింది. పీయూసీ డేటాబేస్(PUC database)ను నేషనల్ రిజిస్టర్(National Register)కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. 1989 మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులకు అనుగుణంగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పీయూసీ సర్టిఫికేట్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌లో.. వాహనంతో పాటు యజమాని వివరాలు, కాలుష్య ఉద్గార స్థాయి వంటి సమాచారం ఉంటుందని వివరించింది. వీటితో పాటు యజమాని మొబైల్ నంబర్‌ను ఇందులో తప్పనిసరి చేసింది. వాహనం ధ్రువీకరణ కోసం ఈ నంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్‌లు వస్తాయని తెలిపింది.
తొలిసారి 'తిరస్కరణ పత్రం'(rejection slip) అనే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది. అనుమతించే స్థాయి కన్నా అధిక ఉద్గారాలు వెలువడుతున్నట్లు పరీక్షల్లో తేలితే.. ఈ స్లిప్‌ను యజమానికి ఇవ్వనున్నట్లు తెలిపింది.
అలా చేయకపోతే జరిమానా...