చైనా ఉత్పత్తులను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వాణిజ్య కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వినియోగించుకుని.. తమ ఉత్పత్తులను ఆసియా దేశాలకు తరిలించే చైనా దిగుమతులపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మారిన కస్టమ్స్ నిబంధనలు ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
"కస్టమ్స్(పరిపాలన వాణిజ్య ఒప్పందాలు) నియమాలు-2020 ప్రకారం.. దిగుమతిదారులు ఇతర వాటాదారులకు తమను తాము పరిచయం చేసుకోవడానికి ఇచ్చిన 30రోజుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి."
- కేంద్ర ఆర్థిక శాఖ