బంగారంపై ఏకీకృత సమగ్ర పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నూతన విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. బంగారం పరిశ్రమ అభివృద్ధి, ఆభరణాల ఎగుమతుల్లో వృద్ధి లక్ష్యంగా నూతన విధానం రూపొందిస్తున్నట్లు తెలిపింది.
బంగారం పాలసీపై సమగ్ర నివేదికను నీతి ఆయోగ్ సమర్పించినట్లు తెలిపారు ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సురీందర్ పాల్ సింగ్. దానిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా బంగారంపై నూతన విధానం ఉంటుందన్నారు.