తెలంగాణ

telangana

పారాసెటమాల్​ ఫార్ములేషన్స్​ ఎగుమతులకు ఓకే

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పారాసెటమాల్​ ఫార్ములేషన్స్​ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది కేంద్రం. అయితే.. ఏపీఐపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

By

Published : Apr 17, 2020, 12:59 PM IST

Published : Apr 17, 2020, 12:59 PM IST

formulations made from Paracetamol
పారాసెటమాల్​ ఫార్ములేషన్స్​ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

పారాసెటమాల్​ ఫార్ములేషన్స్​ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా విస్తరిస్తున్నప్పటికీ.. వాటిని ఎగుమతి చేసేందుకు వీలు కల్పించింది. అయితే.. పారాసెటమాల్​ యాక్టివ్​ ఫార్మాసూటికల్​ ఇంగ్రీడియెంట్స్​ (ఏపీఐ)లపై ఆంక్షలు కొనసాగుతాయని డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారెన్​ ట్రేడ్​ (డీజీఎఫ్​టీ) స్పష్టం చేసింది.

" నిర్ణీత పరిమాణంలోని ఉత్పత్తులు సహా పారాసెటమాల్​ నుంచి తయారయ్యే ఫార్ములేషన్స్​ ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేశాం. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుంది."

- డీజీఎఫ్​టీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలకు సరిపడా నిల్వ ఉంచే క్రమంలో 26 రకాల ఫార్మా ఉత్పత్తులు, ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్రం.

ఇదీ చూడండి:ఆర్థిక ఆరోగ్యానికీ వైరస్‌.. సమష్టి పోరుతోనే విజయం

ABOUT THE AUTHOR

...view details