తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆరోగ్య సేతు' యాప్​తో కరోనాకు దూరంగా ఉండండి! - కరోనా పోరుకు మొబైల్​ యాప్​

కరోనా వైరస్​ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 'ఆరోగ్య సేతు' అనే వైరస్​ ట్రాకర్​ యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్​ ద్వారా ఆరు అడుగుల దూరంలో కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి ఉన్నారా? లేరా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

Govt launches app to assess, alert people about coronavirus patient
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గర్లో ఉన్నారా

By

Published : Apr 2, 2020, 8:40 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సహా ప్రజలను అప్రమత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. యాప్‌ల ద్వారా సమాచారాన్ని మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా 'ఆరోగ్య సేతు' అనే కరోనా వైరస్‌ ట్రాకర్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మైగవ్‌ యాప్‌ ద్వారా చైతన్యం కలిగిస్తున్నా.. పూర్తిస్థాయిలో కొవిడ్‌-19 సమాచారం అందించడం కోసం దీన్ని తీసుకువచ్చింది.

డేటా బేస్‌లో నమోదైన కరోనా బాధిత కేసుల వివరాలను క్రోడీకరించడం ద్వారా లొకేషన్‌, బ్లూటూత్‌ను ఉపయోగించి ఆరు అడుగుల దూరంలో కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి వ్యక్తి ఉన్నారా? లేరా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. డేటాబేస్‌లో ఉన్న వ్యక్తి మీకు సమీపంలో ఉంటే 'హై రిస్క్‌'లో ఉన్నామని, లేకపోతే లేదని యాప్‌లో చూపిస్తుంది. హై రిస్క్‌లో ఉంటే పరీక్ష చేయించుకోమని లేకపోతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1075కి కాల్‌ చేసి దగ్గర్లో ఉన్న టెస్టింగ్ ల్యాబ్‌ను సంప్రదించమని సలహా ఇస్తుంది. వీటితో పాటు కరోనా వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తుంది. ఒకవేళ సదరు వ్యక్తి కరోనా పాజిటివ్ అని తేలితే వెంటనే ప్రభుత్వానికి సమాచారమందిస్తుంది.

ఈ యాప్‌లో ఉన్న మరో సదుపాయం చాట్‌బోట్. దీని ద్వారా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తుంది. అలాగే అన్ని రాష్ట్రాల హెల్ప్‌లైన్‌ నంబర్లు కూడా దీనిలో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు ఈ యాప్‌ ప్రైవసీ పాలసీలో సమాచార ఉల్లంఘనకు ఎలాంటి ఆస్కారం లేదని తెలిపింది.

కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గర్లో ఉన్నారా
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గర్లో ఉన్నారా

ABOUT THE AUTHOR

...view details