తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​ పెట్రోలియం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం

ప్రభుత్వ రంగ సంస్థ భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అందులోని ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని ఈక్విటీలను కొనుగోలుకు పెట్టింది.

bpcl
భారత్​

By

Published : Mar 7, 2020, 10:22 AM IST

భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ను​ ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సంస్థలో ప్రభుత్వ అధీనంలో ఉన్న మొత్తం 52.98 శాతం వాటాల కొనుగోలుకు బిడ్డర్లను ఆహ్వానించింది. బిడ్లను మే 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(డీఐపీఏఎం) ఓ ప్రకటనలో తెలిపింది.

"భారత్​ పెట్రోలియంలో పెట్టుబడుల ఉపహసంహరణకు కేంద్రం ప్రతిపాదించింది. అందులోని ప్రభుత్వానికి చెందిన రూ.114.91 కోట్ల ఈక్విటీలు(52.98శాతం)ను అమ్మి.. నిర్వహణ బాధ్యతలను కూడా బదిలీ చేయనుంది."

-డీఐపీఏఎం ప్రకటన

భారత్​ పెట్రోలియంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో సలహాలు, నిర్వహణ బాధ్యతలను డెలాయిట్ ఇండియా సంస్థకు అప్పగించింది ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details