తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రాయ్​ ఛైర్మన్​ పోస్ట్​కు దరఖాస్తుల ఆహ్వానం - trai latest updates

ట్రాయ్​ ఛైర్మన్​ పోస్ట్​కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కేంద్రం. ప్రస్తుత ఛైర్మన్ ఆర్​ ఎస్​ శర్మ పదవీకాలం సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Govt invites applications for Trai chief's post
ట్రాయ్​ ఛైర్మన్​ పోస్ట్​కు దరఖాస్తుల ఆహ్వానం

By

Published : Jun 6, 2020, 7:53 AM IST

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ప్రస్తుత ఛైర్మన్​ ఆర్ ఎస్​ శర్మ పదవీ కాలం సెప్టెంబరు 30తో ముగియనుంది. కొత్త చీఫ్​ నియామకం కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభించింది కేంద్రం. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.

టెలికాం సంస్థల టారిఫ్​లు, కనెక్షన్ ఛార్జీలు నిర్ణయించే కీలక అధికారం ట్రాయ్​కు ఉంది. స్పెక్ట్రమ్​ వంటి కీలక విషయాలు, టెలికాం రంగంలో సంస్కరణలు, విలీనాలు వంటి వాటిపై ట్రాయ్​దే తుది నిర్ణయం.

టెలికాం, పారిశ్రామిక, ఆర్థిక, గణనశాస్త్రం, చట్ట నిర్వహణ రంగాల్లో వృత్తిపరమైన, ప్రత్యేక అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు. 65 ఏళ్ల లోపు వయసుండాలి. ప్రభుత్వ ఉద్యోగులలో కార్యదర్శి, అదనపు కార్యదర్శి స్థాయి బాధ్యతలు నిర్వర్తించిన వారికి మాాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తులతో పాటు ఇతరుల పేర్లను పరిగణలోకి తీసుకునే అధికారం నియామక​ కమిటీకి ఉంటుంది.

ట్రాయ్​ ప్రస్తుత ఛైర్మన్​ ఆర్​ ఎస్ శర్మ 2015లో బాధ్యతలు చేపట్టారు. 2018 ఆగస్టులో ఆయనకే మళ్లీ అవకాశం ఇచ్చింది నియామక కమిటీ. సెప్టెంబరు 30 వరకు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయనకు 65 ఏళ్లు వస్తున్న కారణంగా పదవీవిరమణ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details