సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమలు, పప్పు ధాన్యాలు, కందుల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలో భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
గోధుమల మద్దతు ధరను క్వింటాలుకు రూ.85, పప్పు ధాన్యాలు క్వింటాలుకు రూ.325 పెంచింది మంత్రివర్గ కమిటీ. కందుల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.255 పెంచింది.