తెలంగాణ

telangana

ETV Bharat / business

డ్రైవింగ్‌ లైసెన్స్‌ల గడువు మరోసారి పొడిగింపు - కొవిడ్‌ విజృంభణ

ఫిట్‌నెస్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్ల పునరుద్ధరణ గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా సమయానికి పొందలేకపోయిన పత్రాలు జూన్​ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది.

Govt extends validity of driving licence, vehicle documents till Jun
డ్రైవింగ్‌ లైసెన్స్‌ల గడువు మరోసారి పొడిగింపు

By

Published : Mar 27, 2021, 5:10 AM IST

మోటారు వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్సులు, ఇతర పత్రాల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. ఫిట్‌నెస్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్లకు ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది.

2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 మార్చి 31 మధ్య గడువు పూర్తయ్యే పత్రాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. 2021 జూన్‌ 30 వరకు ఆ పత్రాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ఇదివరకే నాలుగు సార్లు వాహనాలకు సంబంధించిన పత్రాల గడువును కేంద్రం పొడిగించింది. బహుశా ఇదే చివరి గడువు పొడిగింపు నిర్ణయం కావొచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కొవిడ్‌ వేళ రవాణాకు సంబంధించిన సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details