ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో పన్ను చెల్లించడం ఆలస్యమైన, సవరించిన ఐటీఆర్ల దాఖలు చేసేందుకు గడువిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల చెల్లింపులకు సంబంధించి ఐటీఆర్లు మే 31 నాటికి దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
ఐటీఆర్ దాఖలుకు గడువు పొడిగింపు
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. వివిధ చెల్లింపులకు ఆలస్యమైన, సవరించిన ఐటీఆర్లు దాఖలు చేసేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ అని తెలిపింది.
ఐటీఆర్ దాఖలకు గడుపు పొడిగింపు
కొవిడ్-19 నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) వెల్లడించింది.