ఎయిర్ఇండియా అమ్మకానికి సంబంధించి సందేహాలను వెలిబుచ్చడానికి బిడ్డర్లకు మార్చి 6 వరకు గడువు పెంచింది కేంద్రం. తొలుత సందేహాలను రాతపూర్వకంగా తెలిపేందుకు తుది గడువుగా ఫిబ్రవరి 11ను నిర్ణయించింది.
ఎయిర్ఇండియా: సందేహాలు తెలిపేందుకు గడువు పెంపు - ఎయిర్ఇండియా
ఎయిర్ఇండియా ప్రైవేటీకరణలో ఆసక్తిగల బిడ్డర్లు సందేహాలు వెలిబుచ్చడానికి ఇచ్చిన గడువును పెంచింది ప్రభుత్వం. తొలుత ఫిబ్రవరి 11న అందివ్వాలని ఆదేశాలు ఇచ్చినా.. మార్చి 6వరకు పొడిగిస్తూ నేడు నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ఇండియా
ఎయిర్ఇండియాను 100 శాతం ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆసక్తి ఉన్న బిడ్డర్లు సందేహాలను తెలుపవచ్చని జనవరి 27న స్పష్టంచేసింది.
ప్రాథమిక సమాచార మెమోరాండం(పీఐఎం), షేర్ పర్చేస్ అగ్రీమెంట్పై సందేహాలకు ఫిబ్రవరి 11, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖకు సంబంధించి ఫిబ్రవరి 21 తుది గడువుగా నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియలకు మార్చి 6వరకు పొడిగించింది.
Last Updated : Mar 2, 2020, 10:53 AM IST