తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు - కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వార్తలు

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 2020-21 ఏడాదికి ఐటీ రిటర్నుల దాఖలు గడువును రెండు నెలలు పొడిగించింది కేంద్రం. వ్యక్తిగత ఖాతాదారులు సెప్టెంబర్​ 30లోపు ఐటీఆర్ దాఖలు చేయవచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.

ITR filing
ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు

By

Published : May 20, 2021, 6:29 PM IST

Updated : May 20, 2021, 7:34 PM IST

రెండోదశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించింది కేంద్రం. ఐటీ రిటర్ను(ఐటీఆర్) దాఖలు చేయడానికి రెండు నెలల పాటు గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.

మరోవైపు.. కంపెనీల ఐటీఆర్ దాఖలు గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ సీబీడీటీ నిర్ణయం తీసుకుంది. అలాగే.. కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేసే గడువును జూలై 15 వరకు.. పన్ను ఆడిట్ నివేదిక గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది.

మొత్తంగా.. ఆలస్య, సవరించిన ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి 2022 జనవరి 31 వరకు గడువునిచ్చింది సీబీడీటీ.

ఇవీ చదవండి:కరెంట్​ బిల్ రూ.లక్ష దాటితే ఐటీ రిటర్న్ మస్ట్​

ఐటీఆర్​-1 ఫారంతో రిటర్నుల దాఖలు ఇలా..

Last Updated : May 20, 2021, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details