తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్​టీ వార్షిక రిటర్నులకు మరోమారు గడువు పొడిగింపు - gst return news

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్​టీ వార్షిక రిటర్నుల దాఖలుకు కేంద్రం మరోసారి గడువు పెంచింది. మార్చి 31 వరకు జీఎస్​టీఆర్​-9, జీఎస్​టీఆర్​-9(సీ) రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.

Govt extends due date for filing FY20 GST annual returns till March 31
జీఎస్టీ వార్షిక రిటర్నులకు పెరిగిన గడువు..

By

Published : Feb 28, 2021, 10:44 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్​టీ వార్షిక రిటర్నుల దాఖలుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. జీఎస్​టీఆర్​-9, జీఎస్​టీఆర్​-9(సీ) రిటర్నుల దాఖలుకు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉన్న గడువును మరో నెల పెంచి.. మార్చి 31 వరకు అవకాశం ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే 2020, డిసెంబర్​ 31నుంచి ఫిబ్రవరి 28 వరకు అవకాశం కల్పించింది. తాజా నిర్ణయంతో రెండోసారి గడువు పొడిగించినట్లైంది.

"మొదట విధించిన కాల పరిమితి ప్రకారం..పన్ను చెల్లింపుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ జీఎస్​టీఆర్​-9, జీఎస్​టీఆర్​-9(సీ) రిటర్నుల దాఖలు చేసేందుకు మార్చి 31 వరకు ఆఖరు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే పొడిగించాం."

ABOUT THE AUTHOR

...view details