దేశంలో కొవిడ్-19 మహమ్మారి విజృంభణ క్రమంలో అన్ని కార్లలోనూ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను నాలుగు నెలల పాటు కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు 2021 డిసెంబర్ 31వరకు ఈ నిబంధనను వాయిదా వేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే కార్లలో ఇవి కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇప్పటివరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఎయిర్‌బ్యాగ్ ఉండేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా.. 2021 ఏప్రిల్ 1 తర్వాత ఉత్పత్తి చేసే కార్లలో కచ్చితంగా అన్ని సీట్లకు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలని మార్చి 6న రవాణా శాఖ ఆదేశించింది.