తెలంగాణ

telangana

ETV Bharat / business

పంచదార ఎగుమతుల రాయితీలో భారీ కోత! - చెరకు ఎగుమతులపై సబ్సీడీ

అంతర్జాతీయంగా పంచదార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎగుమతులపై రాయితీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రాయితీ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

sugarcane exports
చెరుకు ఎగుమతులు

By

Published : May 21, 2021, 7:14 AM IST

అంతర్జాతీయంగా పంచదార ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ ఎగుమతులపై రాయితీని తగ్గించింది కేంద్రం. దేశీయ పరిశ్రమలు ఆరు మిలియన్ టన్నుల చెరుకును ఎగుమతి చేసే ప్రాతిపదికన.. అక్టోబర్-సెప్టెంబర్ మధ్యకాలానికి ప్రభుత్వం టన్నుకు రూ.6000 రాయితీని నిర్ణయించింది.

అంతర్జాతీయంగా చక్కెర ధరలు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో రాయితీని రూ.4000కు తగ్గిస్తున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత రాయితీ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

అయితే.. ఇప్పటివరకూ కుదుర్చుకున్న ఎగుమతి ఒప్పందాలకు ఈ రాయితీ తగ్గింపు వర్తించదని.. మే 20 తర్వాత జరిగే వాటికి మాత్రమే వర్తిస్తుందని ఆహార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఈ నిర్ణయంతో దేశీయ పంచదార ఎగుమతుతలపై ప్రభావం ఉండదని ఆశిస్తున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుభోధ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details